గవర్నమెంట్‌ హాస్టల్‌లోని 57 మంది అమ్మాయిలకు కరోనా

గవర్నమెంట్‌ హాస్టల్‌లోని 57 మంది అమ్మాయిలకు కరోనా
  • కాన్పూర్‌‌లో మొత్తం 400 కేసులు
  • 57 మందిలో ఐదుగురు ప్రెగ్నెంట్స్

కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షెల్టర్‌‌ హోమ్‌లోని 57 మంది అమ్మాయిలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వాళ్లందరినీ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. కాగా.. వాళ్లతో కాంటాక్ట్‌ అయిన స్టాఫ్‌, మరికొంత మంది స్టూడెంట్స్‌ను క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు షెల్టర్‌‌ హోమ్‌ను క్లోజ్‌ చేసినట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు కాన్పూర్‌‌లో కేసుల సంఖ్య 400కి చేరింది. యూపీలో అత్యధిక కేసులు నమోదైన ప్రాంతాల్లో కాన్పూర్‌‌ రెండో స్థానానికి చేరుకుంది. 577 కేసులతో నోయిడా మొదటిస్థానంలో ఉంది. కాగా.. పాజిటివ్‌ వచ్చిన 57 మందిలో ఐదుగురు బాలికలు ప్రెగ్నెంట్‌ అని అధికారులు ప్రకటించారు. “ ఆ ఐదుగురిని వివిధ చైల్డ్‌ వెల్ఫేర్‌‌ కమిటీస్‌ షెల్టర్‌‌ హోమ్‌కు పంపారు. వాళ్లంతా షెల్టర్‌‌ హోమ్‌కు వచ్చే ముందే ప్రెగ్నెంట్స్‌. అవి పోక్సో కేసులు” అని జిల్లా కలెక్టర్‌‌ డాక్టర్‌‌ బ్రహ్మ దేవ్‌ క్లారిటీ ఇచ్చారు. షెల్టర్‌‌ హోమ్‌లో వాళ్లు ప్రెగ్నెంట్‌ అని కాంట్రవర్సీ వచ్చిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన స్టాఫ్‌ ద్వారా సోకినట్లు గుర్తించామన్నారు. యూపీలో ఇప్పటి వరకు 17వేల కేసులు, వాటిలో 6 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 507 మంది వ్యాధి బారినపడి చనిపోయారు.