జియో నెక్ట్స్.. అత్యంత చౌక స్మార్ట్ ఫోన్

జియో నెక్ట్స్.. అత్యంత చౌక స్మార్ట్ ఫోన్

జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ. గూగుల్, రిలయన్స్ సంయుక్త భాగస్వామ్యంలో స్మార్ట్ ఫోన్ తయారు చేసినట్టు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 నుంచి మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశాన్ని 2G నుంచి విముక్త చేయాలన్నారు ముకేష్ అంబానీ. 5G డివైసెస్ తయారీకి అంతర్జాతీయ కంపనీలతో పనిచేస్తున్నట్టు చెప్పారు.