త్వరలో 5జీ ఫోన్: శాంసంగ్ గెలాక్సీ ఎస్10

త్వరలో 5జీ ఫోన్: శాంసంగ్ గెలాక్సీ ఎస్10

టెక్నాలజీలో శరవేగంగా కొత్త కొత్త అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. అందరికీ 4జీ ఫోన్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చి మూడు నాలుగేళ్లయినా కాలేదు. అంతలోనే 5జీ వచ్చేస్తోంది. టెలికాం కంపెనీలు ఇప్పుడిప్పుడే అప్ గ్రేడ్ అయ్యే పనిలో పడ్డాయి. ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ శాంసంగ్ కొత్త సిరీస్ ఫోన్ తో రెడీ అయిపోయింది. అతి త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10+ ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది. ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ ఫోన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే శాంసంగ్ కొత్తగా అచ్చు పుస్తకంలా ఉండే ఫోల్డబుల్ ఫోన్ ను కూడా మార్కెట్లోకి తెస్తోంది.

స్పెయిన్ లోని బార్సిలోనాలో ఈ నెల 21న ప్రపంచ మొబైల్ సదస్సు (ఎండబ్ల్యూసీ-2019) జరగబోతోంది. ఈ సదస్సులోనే కొత్త ఫోన్లను శాంసంగ్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

ఎస్10, ఎస్10+ ఫోన్లు భారీగా 12జీబీ ర్యామ్, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారం రూమర్స్ అని శాంసంగ్ ప్రకటించింది.

స్పెషల్ ఫీచర్స్ ఇవీ..

  • 5జీ టెక్సాలజీ సపోర్ట్. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్10.
  • ఎస్10, ఎస్10+ ఫోన్లలో క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ను వాడుతోంది. ఇండియాలో విడుదలయ్యే ఫోన్లలో మాత్రం ఎక్సినోస్ 9820 చిప్ సెట్ తో వస్తాయి. వీటిలో 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ ఒక్కసారిగా భారీగా పెంచేసింది శాంసంగ్. ఎస్9, ఎస్9+ మోడల్స్ లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఈ సారి ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
  • ఎస్10, ఎస్10+ ఫోన్లు మార్చి 8 నుంచి ఆన్ లైన్ సేల్ పెట్టే అవకాశం ఉంది.

ఫోల్డబుల్ ఫోన్

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను ఎండబ్ల్యూసీ 2019లోనే రిలీజ్ చేయబోతోంది శాంసంగ్.  దీని రిలీజ్ విషయం గత నవంబరులోనే ప్రకటించింది. ఇప్పడు  మార్కెట్ లోకి తెస్తోంది.

  • గతంలో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నంగా ఇది పుస్తకంలా తెరుచుకుంటుంది.
  • 7.3 అంగుళాల భారీ డిస్ ప్లే ఈ ఫోన్ స్పెషాలిటీ.
  • 10 లక్షల ఫోన్లు ఒకే సారి మార్కెట్లోకి తేవాలని శాంసంగ్ భావిస్తోంది.