
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అనేక మైలురాళ్లను సాధించింది.అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పురోగతి, జాతీయ ప్రయోజనాల కోసం ఆరు దశాబ్దాలుగా ఇస్రో కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రోకు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపుతోంది. నాసా,ఇస్రో భాగస్వామ్యంలో ISRO వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి పంపుతోంది.
మే 29న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించే ఫాల్కన్ 9 స్పేస్ నౌకలో శుక్లా నింగిలోకి దూసుకెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10.33 గంటలకు మరో ముగ్గురు సిబ్బందితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) చేరుకుంటారు.
Also Read : 2024లో మన దేశం సైన్యంపై ఎంత ఖర్చు చేసిందో వెల్లడించిన సిప్రి
స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్9 స్పేస్క్రాఫ్ట్ ద్వారా మూడో మానవ అంతరిక్ష ప్రయాణం. పోలాండ్, హంగేరీ నుంచి అంతరిక్షంలో బస చేసే మొదటి వ్యోమగాములను ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళుతోంది.
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గగన్‌యాన్ సిబ్బందిలో ఒకరు. ఆక్సియం మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాన్షు శుక్లా ISS లో 14 రోజులు పాటు గడపనున్నారు. ఆక్సియం మిషన్ 4 (Ax4) పైలట్ గా శుక్లా వ్యవహరిస్తారు. మైక్రోగ్రావిటీ పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో శుక్లా అంతరిక్షంలో ఏడు ప్రయోగాలు చేయనున్నారు.
ఈ మిషన్ లో శుక్లతో పాటు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ,పోలాండ్ కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్ స్కీ, హంగేరికి చెందిన విస్నివ్ స్కీ టిబోర్ కాపు ఉన్నారు. పెగ్గీ వాణిజ్య మిషన్‌కు నాయకత్వం వహిస్తారు. మిగతా ఇద్దరు మిషన్ నిపుణులు.వీరు సైన్స్, ఔట్రీచ్,వాణిజ్య కార్యకలాపాలతో కూడిన ఒక మిషన్‌ను నిర్వహిస్తారు.
మరోవైపు భారత్ కూడా సొంత స్పేస్ స్టేషన్ ను కలిగి ఉండాలని ప్రయోగాలు చేస్తోంది. 2035 నాటికి సొంతఅంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2047నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.