
మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ రహదారిపై తిర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చిఖాలియా ఫటా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సోయాబీన్ పంట సేకరించేందుకు కార్మికులతో వెళ్తున్న వ్యాన్ పంక్ఛర్ కావడంతో రోడ్డు పక్కన డ్రైవర్ నిలిపివేశారు. అదే సమయంలో అటు వైపుగా వెనుక నుంచి వచ్చిన గ్యాస్ ట్యాంకర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంలో కూర్చున్న ఆరుగురు కార్మికులు అట్టడికక్కడే చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఇండోర్ ఆస్పత్రికి తరలించారు.