మూడు యాక్సిడెంట్లలో.. ఆరుగురు కూలీలు మృతి

మూడు యాక్సిడెంట్లలో.. ఆరుగురు కూలీలు మృతి

లక్నో: లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. యూపీలో గురువారం రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు వలస కార్మికులు బలయ్యారు. గుజరాత్ నుంచి యూపీలోని సొంతూరికి నడుస్తున్న ముగ్గురు కూలీలు బారాబంకి దగ్గరలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర వలస కూలీలతో బయల్దేరిన ట్రక్కు అదుపుతప్పడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. బహ్రయిచ్ లో జరిగిన ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలయ్యాయి. మరో ఘటనలో జలన్ జిల్లాలో ఇద్దరు వలస కూలీలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
అంతకుముందు రోజు మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్ కు చెందిన 70 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును.. బస్సు ఢీకొట్టడంతో 8మంది చనిపోయారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ముజఫర్‌‌ నగర్‌‌లో రోడ్డుపై నడిచివెళ్తున్న బీహార్​కు చెందిన కూలీలపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చనిపోయారు.