గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు

గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు

గంగానదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బిహార్ రాజధాని పాట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. 2024,  జూన్ 16వ తేదీ ఆదివారం గంగా నదిలో పదిహేడు మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. పదకొండు మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. 

గల్లంతైన ఆరుగురి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. బోటు బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

మే19వ తేదీ కూడా బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. కొందరు రైతులు తమ కూరగాయలను పడవలో తీసుకెళ్తుండగా.. మహావీర్ తోలా ఘాట్ వద్దకు చేరుకునే క్రమంలో పడవ బోల్తా పడింది. కాగా  గంగా నదిలో వరుస సంఘటనలు జరగడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.