
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 60,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కి చేరింది. ఇందులో 7,04,348 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 66,550 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 24,04,585గా ఉంది. సోమవారం దేశవ్యాప్తంగా 848 మంది కరోనాతో మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 58,390కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
For More News..