591కి చేరిన ఒమిక్రాన్ కేసులు

591కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఒమిక్రాన్ కేసులు 8వేల 891కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు కేరళలో ఇవాళ ఒక్క రోజే 69 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 591కి చేరినట్లు తెలిపింది. ఈ కేసుల్లో 401 మంది ‘లో రిస్క్’ దేశాల నుంచి వచ్చిన వారేనని, 101 మంది మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి వచ్చిన వాళ్లని  పేర్కొంది. మరో 70 మంది విదేశాల నుంచి వచ్చిన పేషెంట్ల కాంటాక్ట్స్ అని, మరో 19 మంది వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారని వెల్లడించింది.

మరోవైపు దేశంలో డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. కర్ణాటకలో ర్యాలీలు, ఫంక్షన్స్ పై ఆంక్షలు పెట్టారు. బహిరంగ స్థలాల్లో 200 మందికి మించి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఆడిటోరియాలు, ఫంక్షన్ హాల్స్ లాంటి వాటిలో 100 మందికి మించి సభల్లో పాల్గొన్న కూడదని ప్రభుత్వం ఆదేశించింది. వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేశారు. జిమ్స్, షాపింగ్ మాల్స్ ను 50 శాతం కెపాజిటితో నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. తమిళనాడు, జమ్మూకశ్మీర్, యూపీ, ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. 50శాతం కెపాసిటీతో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

ఈ వారం ఓటీటీలో అఖండ, శ్యామ్ సింగరాయ్

ఛత్తీస్గఢ్ బార్డర్లో కాల్పులు.. ఇద్దరు మావోలు మృతి

నేనేం ప్లాస్టిక్‌‌ బొమ్మను కాదు