ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్​ టికెట్ల కోసం పోటా పోటీ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్​ టికెట్ల కోసం పోటా పోటీ
  • బాన్సువాడలో అత్యధికంగా 16 మంది అర్జీలు
  • నిజామాబాద్​ అర్బన్ ​నుంచి 12 దరఖాస్తు
  • ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​టికెట్లపై టెన్షన్.. టెన్షన్​ 

నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 67 మంది లీడర్లు కాంగ్రెస్​ టికెట్​కోసం దరఖాస్తు చేసుకున్నారు. బోధన్, కామారెడ్డి సెగ్మెంట్లలో రెండేసి దరఖాస్తులు రాగా, మిగిలిన ఏడు చోట్ల అంతకన్నా ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. బాన్సువాడ నుంచి అత్యధికంగా 16 మంది అప్లికేషన్లు పెట్టకోగా, అర్బన్​ నుంచి 12, ఆర్మూర్ ​నుంచి 10, జుక్కల్​ 8, నిజామాబాద్ ​రూరల్​7, బాల్కొండ నియోజకవర్గం నుంచి 6, ఎల్లారెడ్డి నుంచి 4 దరఖాస్తులు టీపీసీసీకి అందాయి. వీరిలో పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం వస్తోందోనన్న చర్చ సాగుతోంది.

అర్బన్​పై ఈరవత్రి ఆసక్తి..

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్​ఊహించని రీతిలో అర్బన్ ​నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అర్బన్​లో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆయన ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, మాజీ మేయర్​ సంజయ్, కేశవేణు, తాహెర్ ​టికెట్​రేసులో ఉన్నట్లు మొన్నటి దాకా భావించగా, మున్సిపల్ ​మాజీ వైస్ ​చైర్మన్​ భక్తవత్సలం నాయుడు, నరాల రత్నాకర్, నరాల కల్యాణ్​కుమార్, శివప్రసాద్, కులాచారి వెంకటేశ్వర​రావు, సయ్యద్​ నజీబ్​అలీ, రామర్తి గోపీ కృష్ణ అప్లికేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు మైనార్టీ లీడర్లు కాగా, మిగతా వారంతా బీసీ సామాజికవర్గానికి చెందినవారే.

ఆర్మూర్​ అడుగుతున్న మంత్రి సోదరి

జిల్లా మంత్రి ప్రశాంత్​రెడ్డి సోదరి వేముల రాధికారెడ్ది ఆర్మూర్​ టికెట్​ కోసం దరఖాస్తు చేశారు. ఊహించినట్లుగానే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్​మార చంద్రమోహన్​, పొద్దుటూరి వినయ్​రెడ్డి అభ్యర్థిత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. గోర్త రాజేందర్, యాల్ల సాయిరెడ్డి, కోట వెంకటేశ్, అశోక్​గౌడ్, మహిపాల్​రెడ్డి, తలారి పోచన్న కొత్తగా తెరపైకి వచ్చారు.

రూరల్​లో ..

గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ భూపతిరెడ్డితో పాటు మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ ​నగేశ్​రెడ్డి, ఇటీవల కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అర్జీ పెట్టారు. పార్టీ లీడర్లు కెతావత్​ మోతీలాల్, చంద్రశేఖర్​గౌడ్, నల్ల సుధాకర్​రెడ్డి, బేల్దారి గోవర్ధన్ దరఖాస్తులు అందించారు. 

బాల్కొండ కోసం జిల్లా ప్రెసిడెంట్​ 

కాంగ్రెస్​ జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ ​రెడ్డి బాల్కొండ నుంచి టికెట్​కోరుతూ దరఖాస్తు చేశారు. ఆరెంజ్ ​ట్రావెల్స్​అధినేత ముత్యాల సునీల్​రెడ్డి, కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​​రెడ్డితో పాటు క్యాతం గంగారెడ్డి, బాస వేణుగోపాల్ ​యాదవ్, జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమలత అగర్వాల్ టికెట్
​కోరుతున్నారు. 

రెండు చొప్పున

బోధన్​నుంచి మాజీ మంత్రి సుదర్శన్​రెడ్ది, కెప్టెన్​ కరుణాకర్​రెడ్డి, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్​అలీ, డాక్టర్ కనుగంటి రాజు అర్జీ పెట్టుకున్నారు. పార్టీ ప్రకటించే మొదటి లిస్టులో ఈ రెండు నియోజకవర్గాల క్యాండిడేట్ల పేర్లు ఉంటాయని పరిశీలకుల అంచనా. 

ఎల్​బీనగర్​లో మధుగౌడ్ యాష్కీ​

జిల్లా నుంచి రెండుసార్లు ఎంపీగా వ్యవహరించిన మధుగౌడ్​యాష్కీ అసెంబ్లీకి వెళ్లే ఆసక్తితో హైదరాబాద్​లోని ఎల్​బీ నగర్​ నుంచి​దరఖాస్తు పెట్టారు. ఆయన పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్​గా ఉన్నారు.

బాన్సువాడలో 16 మంది

బాన్సువాడ నుంచి ఇద్దరు లీడర్ల మధ్యే టికెట్​ పోటీ ఉంటుందని మొన్నటి వరకు భావించగా ఇప్పుడు ఏకంగా 16 మంది సై అంటున్నారు. 2018 ఎలక్షన్​లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంటెస్ట్​చేసి ఓడిపోయిన కాసుల బాల్​రాజ్​తో పాటు మాసాని అనిల్​కుమార్​రెడ్డి, కొడాలి సురేశ్, శ్రీనివాస్​గౌడ్, కేతావత్​మోతీలాల్, పుప్పాల శంకర్, రెడ్డిగారి జ్యోతిర్మయరెడ్డి, ఎలమంచిలి శ్రీనివాస్​రావు, రమావత్​అంబర్​సింగ్, ఇందూరు చంద్రశేఖర్, మాసాని శ్రీనివాస్​రెడ్డి, బొప్పిడి వెంకట్రామ్​రెడ్డి, ముత్తారెడ్డి రాజారెడ్డి, డాక్టర్ అజయ్​కుమార్, సోమశేఖర్​రావు, మెగావత్​ప్రతాప్​సింగ్​ అప్లికేషన్​ పెట్టారు.