ములుగు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో .. 77మందికి జరిమానా.. ఐదుగురికి మూడురోజుల జైలు శిక్ష

ములుగు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో .. 77మందికి జరిమానా.. ఐదుగురికి మూడురోజుల జైలు శిక్ష

ములుగు (గోవిందరావుపేట), వెలుగు : గోవిందరావుపేట మండల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 77మందికి రూ.65వేల జరిమానాతోపాటు ఐదుగురికి మూడు రోజుల జైలు శిక్ష పడినట్లు పస్రా ఎస్సై కమలాకర్​ తెలిపారు. 

కొద్ది రోజులుగా పస్రా, గోవిందరావుపేట పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం తాగి బ్రీత్​ అనలైజర్​ టెస్ట్ లో 77మంది పట్టుబడ్డారని, వారికి ములుగు కోర్టు జేఎఫ్​ కోర్టు మెజిస్ట్రేట్​జ్యోత్స్న రూ.65వేల జరిమానా, ఐదుగురికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.