
బషీర్‌బాగ్,వెలుగు: వైన్‌షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా సకల హంగులతో సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని, దీంతో బార్ షాపులకు గిరాకీ తగ్గుతోందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. వంద చదరపు గజాల్లో వైన్‌షాపులు సిట్టింగ్‌లు నిర్వహించాల్సి ఉండగా.. ఎకరా స్థలంలో ఫుడ్ ఐటమ్స్ పెట్టి నడిపిస్తున్నారన్నారు. అలాగైతే బార్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. అక్టోబర్ నెలలో రానున్న కొత్త మద్యం పాలసీలో బార్ ఓనర్ల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.