
హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖలో రిటైర్ అయ్యేరోజు మరో ఏబీసీడీఓకు డీబీసీడీఓగా ప్రమోషన్ ఇచ్చారు. జూన్ 30న జిల్లా బీసీ సంక్షేమాధికారి(డీబీసీడీఓ)గా 13 మందికి ప్రమోషన్లు ఇవ్వాలని డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ అవ్రూవల్ ఇచ్చింది. అయితే, డీబీసీడీఓ అవ్వగానే అదేరోజు రిటైర్ కాబోయే హైదరాబాద్ మహిళా ఏబీసీడీఓకు ప్రమోషన్ ఇచ్చారు. తమకూ మరుసటి రోజు ఆర్డర్లు ఇస్తారని మిగిలిన ఆశపడ్డ 12 మందికి నిరాశే ఎదురైంది. ఈ విషయాన్ని కొందరు ‘వెలుగు’ దృష్టికి తీసుకొచ్చారు.
అయితే, సదరు అధికారులు ప్రమోషన్ లిస్టులో ఉన్న అధికారులను పిలిచి, మీడియాకు సమాచారం ఇవ్వొద్దని హెచ్చరించిట్లు సమాచారం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతున్నారనే వివరాలు తీసుకొని పంపించారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల ఇన్‌చార్జి డీబీసీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఏబీసీడీఓ అధికారి కూడా జులై 31న రిటైర్ అయ్యారు. ఆయనకూ చివరిరోజే సిరిసిల్ల డీబీసీడీఓగా ప్రమోషన్ ఆర్డర్ ఇచ్చారు. మిగిలిన 11 మందిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.