వికారాబాద్ జిల్లాలో 7 అంతర్రాష్ట సరిహద్దు చెక్ పోస్టులు

వికారాబాద్ జిల్లాలో 7 అంతర్రాష్ట సరిహద్దు చెక్ పోస్టులు

వికారాబాద్, వెలుగు :  లోక్ సభ ఎన్నికల దృష్ట్యా వికారాబాద్ జిల్లాలో పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు.  జిల్లాకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నందున7 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. చంద్రకల్, కస్తూర్ పల్లి, మైల్వార్, ఇందర్చేడ్, నవాంగి, కొత్లాపూర్, బోపనారం ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాల నిఘాలో  నిరంతరం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేలకుపైన ఎక్కువ డబ్బు ఉంటే సంబంధిత  రసీదులు ఉండాలని, లేదంటే సీజ్ చేస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ వస్తువులు, పరికరాలు, బంగారం, వెండి తదితర వస్తువులు తరలించే సమయంలో కచ్చితంగా వాటికి రసీదులు ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి  సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వాహనాల తనిఖీలు

కొడంగల్ :  తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో కొడంగల్​మండలం కస్తూర్​పల్లి, దౌల్తాబాద్​ మండలం చంద్రకల్​వద్ద ఏర్పాటు చేసిన చెక్​ పోస్ట్​ల్లో వాహనాల తనిఖీలు ప్రారంభించారు. సోమవారం తహసీల్దార్​ విజయ్​కుమార్​, సీఐ శ్రీధర్​రెడ్డిలు పర్యవేక్షించారు. నగదు, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు రాష్ర్టంలోకి రాకుండా చెకింగ్ లు చేస్తున్నట్టు తెలిపారు.  ప్రత్యేక టీమ్​లతో చెక్​ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తామని చెప్పారు.