వృద్ధురాలి సాహసం..రైలుకు తప్పిన ప్రమాదం

వృద్ధురాలి సాహసం..రైలుకు తప్పిన ప్రమాదం

ఓ వృద్ధురాలి సమయస్ఫూర్తితో మంగళూరు నుంచి ముంబైకు వెళ్తున్న మత్స్యగంధ రైలుకు ముప్పుతప్పింది. మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరు పడీల్‌ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం విరిగి పడింది. ఆ సమయంలో మంగళూరు టు ముంబైకి మత్స్యగంధ రైలు వెళ్తోంది. దీన్ని గమనించి వృద్ధురాలు చంద్రావతి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలు ముందు జెండాలా ఊపింది. ఇది గమనించిన లోకో పైలట్‌ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. 

అనంతరం స్థానికుల సాయంతో పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. ఇంత పెద్ద ప్రమాదాన్ని తప్పించడంతో అందరూ చంద్రావతిని అభినందించారు. తనకు గుండె ఆపరేషన్‌ అయిన విషయాన్ని కూడా లెక్క చేయలేదని, పరుగుత్తుకెళ్లి ఎర్రటి వస్త్రాని జెండాలా ఊపానని,  వెంటనే రైలును పైలట్​ ఆపారని చంద్రావతి వివరించింది. ఈ ఘటన కర్నాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.