73 కేజీల కేక్ కటింగ్.. మాజీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్

73 కేజీల కేక్ కటింగ్..  మాజీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్ బీ రమ్య గ్రౌండ్ వద్ద టీడీపీ డివిజన్ నేతల ఆధ్వర్యంలో 73 కేజీల భారీ కేకును కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మాణంలో తనదైన ముద్ర వేసి విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని టీడీపీ నేతలు, చంద్రబాబును కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు.