గద్వాల, వెలుగు: కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గద్వాల మండలం గోన్పాడు గ్రామ శివారులో వెహికల్స్ చెక్ చేస్తుండగా, 75 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని డీసీఎం వెహికల్ లో తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ధరూర్ గ్రామానికి చెందిన తెలుగు కృష్ణపై కేసు నమోదు చేసి, మినీ డీసీఎంను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
