ములుగులో రూ.2 కోట్ల విలువైన 757 కేజీల గంజాయి దహనం

ములుగులో రూ.2 కోట్ల విలువైన 757 కేజీల గంజాయి  దహనం

తెలంగాణలో భారీగా గంజాయి, డ్రగ్స్  అక్రమ రవాణా జరుగుతోంది. తనిఖీల్లో పోలీసులు భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు దహనం చేస్తున్నారు. లేటెస్ట్ గా అక్టోబర్ 13న  ములుగు జిల్లాలో   పోలీసులు  రెండు కోట్ల విలువైన 757 కేజీల గంజాయిని కాల్చి వేశారు.

 ములుగు టౌన్ , పస్రా, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం వంటి పలు ప్రాంతాల్లో పట్టుకున్న డ్రగ్స్ ను  డ్రగ్ డిస్పోజల్ కమిటీ సూచన మేరకు దహనం చేశామని.. దీని విలువ రూ. 2కోట్లు ఉంటుందని ములుగు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.  

Also Read : WhatsApp: కాల్ ప్రైవసీ కోసం కొత్త ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే

మొత్తం ఏడు కేసులు నమోదు చేసి 20 కి పైగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు.  ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని.. అక్రమ మద్యం ,నగదు, గంజాయి స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 ఇటీవల