798 మంది డాక్టర్లు మృతి

798 మంది డాక్టర్లు మృతి

కరోనా నియంత్రణలో కష్టపడి పనిచేస్తున్న డాక్టర్లు కూడా అదే మహమ్మారికి బలవుతున్నారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు 798 మంది డాక్టర్లు చనిపోయారని తెలిపింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది డాక్టర్లు మరణించారు. తర్వాత బిహార్ లో 115మంది, యూపీలో 79 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 23 మంది డాక్టర్లు, కేరళలో 24మంది డాక్టర్లు విధి నిర్వహణలో చనిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్ లోనూ వెయ్యికి పైగా డాక్టర్లు మృతి చెందారు.