సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా..8 మంది గల్లంతు

V6 Velugu Posted on May 25, 2021

విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఓ చిన్నారి డెడ్ బాడీ దొరికింది. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. లాక్ డౌన్ తో పని లేకపోవడంతో హైదరాబాద్ నుంచి 11 మంది వలస కూలీలు ఓడిశా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. ఒడిశా వెళ్తుండగా పడవలు బోల్తా పడ్డాయి. గల్లంత్తైన ఏడుగురి కోసం గాలిస్తున్నారు అధికారులు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Tagged AP, workers, 8 migrant, missin, one body recovere, boat capsized, Sileru river

Latest Videos

Subscribe Now

More News