
‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రం ‘8 వసంతాలు’. హను రెడ్డి, రవి, సంజన ఇతర పాత్రలు పోషించారు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనంతిక మాట్లాడుతూ ‘ఈ సినిమాకి ఆడియెన్స్ ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు.
థియేటర్స్‌లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్ ఫుల్‌గా అనిపించింది. నా క్యారెక్టర్‌కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ఇలాంటి సినిమాతో పరిచయమవడం హ్యాపీగా ఉందని హను రెడ్డి అన్నాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన టీమ్.. ఈ సక్సెస్‌లో భాగమవడం ఆనందంగా ఉందని అన్నారు.