ఏపీలో ఘోరం జరిగింది.. 8వ తరగతి చదువుతున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన మడకశిరలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మడకశిర మండలంలోని ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్.. గురువారం ( నవంబర్ 28, 2024 ) అదృశ్యం అవ్వడంతో అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం ( నవంబర్ 29, 2024 ) మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలుడి హత్యతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. బాలుడి హత్యకు గల కారణాలు వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.