జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు

జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్​రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్​ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం బడాపహాడ్​ నుంచి వర్ని వైపు వెళ్తోంది. జాకోరా ఎక్స్​రోడ్డు మూలమలుపు వద్ద బస్సు ఆగగా.. వర్ని వైపు నుంచి ఇసుకతో వస్తున్న టిప్పర్​ ఢీకొట్టింది. 

ఈఘటనలో సుమారు 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 లో ఏరియా హాస్పిటల్​కు తరలించారు. టిప్పర్​ డ్రైవర్​ షేక్​నభీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 71 మంది ప్రయాణికులు ఉన్నారు.