
కేవలం 7వేల 500 పోస్టులు.. లక్షల్లో దరఖాస్తులు..పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, పీహెచ్డీ హోల్డర్లు సహా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు అర్హత కేవలం ఉన్నత పాఠశాల చదువు మాత్రమే. దీనిని బట్టి అక్కడ ఎంత నిరుద్యోగ సంక్షేభం ఉందో ఇట్టే అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ లో కానిస్టేబుల్పోస్టులకు వచ్చిన దరఖాస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కేవలం 7వేల500 పోస్టులకు దాదాపు 9.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యోగాల సంక్షోభాన్ని వేలెత్తి చూపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవసరమైన అర్హత 10వ తరగతి (హైస్కూల్) మాత్రమే - అయినప్పటికీ దరఖాస్తుదారులలో 52వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 33వేల మంది గ్రాడ్యుయేట్లు, 12వేలమంది ఇంజనీర్లు,దాదాపు 50 మంది పీహెచ్ డీ హోల్డర్లు కూడా ఉన్నారు.
నియామక పరీక్ష అక్టోబర్ 30న జరగనుంది. రెండు షిఫ్టులతో - ఒకటి ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మరొకటి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు.
ఎందుకీ దుస్థితి..
మధ్యప్రదేశ్‌లోని చాలా మంది విద్యావంతులైన యువతకు, కానిస్టేబుల్ పరీక్ష అంటే భద్రత గురించి కాదు..ఉద్యోగ భద్రత గురించి. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల డిగ్రీ పట్టభద్రులు కూడా 10వ తరగతి స్థాయి పోస్టులను చేపట్టాల్సి వస్తోందని అభ్యర్థులు అంటున్నారు.కానిస్టేబుల్ పరీక్షకు వచ్చిన ఈ స్పందన ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తుంది.- పెరుగుతున్న నిరుద్యోగం మధ్య పరిమిత ప్రభుత్వ పోస్టులకు పెరుగుతున్న పోటీని సూచిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో కేవలం 7,500 కానిస్టేబుల్ పోస్టులకు 9.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాల సృష్టించలేని అసమర్థ నేతలను ఎన్నుకోవడం ఈ పరిణామాలకు దారితీస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.