బ్రెజిల్ లో కరోనా ను జయించిన 99 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారి

బ్రెజిల్ లో కరోనా ను జయించిన 99 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారి

బ్రెజిల్ : బ్రెజిల్ లో 99 ఏళ్ల మాజీ సైనాకాధికారి ఎర్మాండో పివేటా కరోనా ను జయించాడు. సెకండ్ వరల్డ్ వార్ లో లిప్ట్ నెంట్ అధికారిగా శత్రువులు పోరాడిన ఆయన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతోనూ పోరాడి గెలవటం విశేషం. పివేటా సెకండ్ వరల్డ్ వార్ లో ఆఫ్రికాలోని బ్రెజిలియన్ అర్టిల్లరీ కి సెకండ్ లెఫ్టినెంట్ గా పనిచేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవటంతో మంగళవారం ఆయనను ఆర్మీ హానర్ తో గౌరవంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. గ్రీన్ క్యాప్ ధరించి, అభివాదం చేస్తూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన పివేటాను చప్పట్లు కొడుతూ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది గౌరవంగా ఇంటికి పంపించారు. “ఇది యుద్ధంలో కన్నా గొప్ప పోరాటం. యుద్ధంలో చావటమో లేదా చంపటమో. కానీ ఇక్కడ బతికేందుకు పోరాడాలి. కచ్చితంగా ఈ పోరాటంలో కరోనా ఓడిపోతుంది ” అని పివేటా అన్నారు. పివేటా కరోనాను జయించటంపై బ్రెజిల్ ఆర్మీ సంతోషం వ్యక్తం చేసింది. ” పివేటా మరో యుద్ధంలో గెలిచారు. ఐతే ఈ సారి కరోనావైరస్ పై పోరాటంలో ” అని మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది.