
ఓ పాట యూట్యూబ్ ని కుదిపేస్తోంది. రెండేళ్లలో 600 కోట్లకు పైచిలుకు వ్యూస్ సాధించి, ఎక్కువ సార్లు చూసిన వీడియోగా రికార్డు సృష్టించింది. అదే పోర్టోరి కో సింగర్ లూయిస్ ఫొన్సీ మెగా హిట్ ‘డెస్పాసిటో’. ఇంగ్లిష్, స్పానిష్ లిరిక్స్‌తో ఈ పాటను రాసిన ఫొన్సీ, 2017 జనవరిలో రిలీజ్ చేశాడు. ఐదు బిలియన్ల వ్యూస్ దాటిన తర్వాత హ్యాకర్లు దాడి చేసి డెస్పాసిటో సాంగ్ ను డిలీట్ చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ పేరెంట్ గూగుల్ డిలీటెడ్ వీడియోలను మళ్లీ రీస్టోర్ చేసింది. దీంతో మళ్లీ డెస్పాసిటోకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 7 వేల కోట్ల అప్పులతో దివాలా అంచున ఉన్న పోర్టోరికో ఆర్థికస్థితిని ఈ పాట మార్చేసిందంటే నమ్ముతారా? ఈ పాట వల్లే గత ఏడాది టూరిస్టులు 45 శాతం పెరిగారట. ఆ పాట తీసిన ప్రాంతాలను టూరిస్టులు చూపించాల్సిందిగా టూర్ ఆపరేటర్లను కోరారట. డెస్పాసిటో ప్రేరణగా తెలుగులోనూ ఫ్రీ–మేక్ చేశారు. సింగర్లు నోయల్ సీన్, ఎస్తర్ నొరాహాలు ‘డెస్పాసిటో ప్రేమలో పడ్డా’ పాటను పాడారు.