బాలిక‌ను బలి తీసుకున్న ఆస్తి గొడవ

బాలిక‌ను బలి తీసుకున్న ఆస్తి గొడవ

కాన్పూర్‌: అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఆస్తి త‌గాదాలు అభం శుభం తెలియ‌ని 15 ఏండ్ల బాలిక ప్రాణాల‌ను బ‌లితీసుకున్నాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సొంత చిన్నాన్న పెద‌నాన్న‌లే బాలిక‌ను హ‌త్య‌చేశారని తెలిపారు పోలీసులు. చేను ద‌గ్గ‌ర ఒంటరిగా క‌నిపించిన బాలిక‌ను హ‌త‌మార్చి అక్క‌డే ప‌డేయడంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

బాలిక తండ్రి చేనులో బిడ్డ మృతదేహాన్ని చూసి, వెంట‌నే స‌మాచారం ఇచ్చాడన్నారు పోలీసులు. త‌న సోద‌రుల‌కు, త‌నకు మ‌ధ్య భూమి గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, వాళ్లే నా బిడ్డ‌ను హ‌త్య‌చేసి ఉంటార‌ని ఫిర్యాదు చేశాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన ద‌ర్యాప్తు చేప‌ట్టామని..  నిందితులు ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు పోలీసులు.