కాకిని కాపాడి ఈ చిన్నారి  హీరో అయ్యాడు

కాకిని కాపాడి ఈ చిన్నారి  హీరో అయ్యాడు

ఎవరు ఎప్పుడు.. ఎలా హీరో అవుతారో.. ఎవర్ని ఎప్పుడు సమాజం ఎలా ఆదరిస్తుందో ఊహించటం కష్టం..ఇలాంటి ఘటన ఇప్పుడు ఒకటి జరిగింది. ఓ కాకిని కాపాడిన పిల్లోడిని ఇప్పుడు నెటిజన్లు ఆహా..ఓహా అంటున్నారు. కాకి కనిపిస్తే తోలుతాం.. ఛీ.. ఛీ.. పాడు కాకులు అంటాం.. కాకి అరిస్తే అరిష్టం అంటాం.. ఇప్పుడు మాత్రం అలాంటి కాకిని కాపాడిన పిల్లోడు హీరో అయ్యాడు. ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అయ్యింది.

ఓ ఖాళీ స్థలానికి రక్షణగా వేసిన ఫెన్సింగ్ లో చిక్కుకుంది ఓ కాకి. తప్పించుకునే మార్గం లేక.. అరుస్తుంది. అటుగా వెళుతున్న స్కూల్ పిల్లలు దాన్ని గమనించారు. మిగతా పిల్లలు అందరూ చూస్తూ ఉన్నా.. ఓ బుడ్డోడు మాత్రం దైర్యం చేసి.. ఫెన్సింగ్ లోకి చిక్కుకున్న కాకిని కాపాడాడు. దాన్ని స్వేచ్ఛగా ఎగురవేశాడు. దీనిపై నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు. పిల్లల్లో జంతువులు, పక్షులపై ఇలాంటి దయ, కరుణ ఉండాలని.. ఆ బాలుడు చేసింది మంచి పని అంటున్నారు.. 

స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆ చిన్నారికి ఎంత మంది హృదయం ఉంది.. కాపాడిన కాకిని తన స్నేహితులకు చూపించి ఎంతో మురిసిపోతున్నాడు.. చిన్న పిల్లల్లో ఇలాంటి మానవత్వం లక్షణాలు పెంచాల్సిన అవసరం అందరికీ ఉందని మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు. ఎంతో శ్రద్ధగా.. జాగ్రత్తగా.. కాకిని ఫెన్సింగ్ నుంచి రక్షించటం చూస్తుంటే.. ఆ పిల్లోడిలో బాధ్యత, క్రమశిక్షణ ఎంతో ఉంది.. పిల్లలకు ఇలాంటివే నేర్పించాలని సమాజం పట్ల అంటూ మరికొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మంచి మనస్సు ఉన్నప్పుడు.. దయ, మానవత్వం ఇలాగే వస్తాయని మరికొంత మంది కామెంట్స్ చేస్తూ.. చిన్నారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాకిని కాపాడిన చిన్నారి.. ఇవాల్టి సోషల్ మీడియాకు హీరో అయ్యాడు.