
జీడిమెట్ల, వెలుగు : విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కోర్టు ఉద్యోగిపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి కోర్టులో ఓ మహిళకు చెందిన విడాకుల కేసు నడుస్తోంది.
ఈ కేసు విషయమై ఆమె కోర్టుకు వచ్చి వెళ్తుండేది. మంగళవారం సదరు మహిళ కోర్టుకు వచ్చిన సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగి నరేశ్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు జగద్గిరిగుట్ట పీఎస్ లో కంప్లయింట్ చేసింది. పోలీసులు నరేశ్‌పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.