తండ్రి అమ్మిన స్థలాన్ని కాజేసే యత్నం

తండ్రి అమ్మిన స్థలాన్ని కాజేసే యత్నం

కరీంనగర్‌ క్రైం, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, ఇదివరకే తండ్రి అమ్మిన భూమిని ఆక్రమించినందుకు నలుగురిపై కేసు నమోదైంది. ఇందులో ఇద్దరిని ఆరెస్టు ఆరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కరీంనగర్ రూరల్ ఇన్​స్పెక్టర్ ​ప్రదీప్ కుమార్ కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య పవర్ లూమ్​కార్మికుడు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని సర్వేనెంబర్ 233లోని 293.33 చదరపు గజాల స్థలాన్ని 2003లో మూల గౌరా రెడ్డి దగ్గర కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 

గౌరా రెడ్డి చనిపోయిన తర్వాత అతడి కొడుకు తిరుమల రెడ్డి స్థలాన్ని రెండు ప్లాట్లుగా విభజించాడు. గౌరారెడ్డి భార్య వీరమ్మ పేరిట తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించాడు. మూల సూర్యప్రకాష్ రెడ్డి, లంక శేఖర్​కు అమ్మినట్టుగా తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆ జాగాలో గోడ కట్టాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో తిరుపతి రెడ్డి, వీరమ్మ, సూర్య ప్రకాష్ రెడ్డి, శేఖర్ పై కేసు నమోదు చేశారు. తిరుపతి రెడ్డి, శేఖర్​ను అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పర్చగా  14 రోజుల రిమాండ్ విధించింది.