సోషల్ మీడియాలో వైరల్ గా ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్

సోషల్ మీడియాలో వైరల్ గా ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్

పాకిస్థాన్ : పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. యూకేలో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉండేదో చెబుతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘గాడిద ఎప్పటికీ గాడిదే’ అంటూ ఇమ్రాన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

తాను బ్రిటన్ లో ఎక్కువ కాలం గడిపానని, అక్కడ చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యాన్స్ తనను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినప్పటికీ ఆ దేశాన్ని (బ్రిటన్) తానెప్పుడూ సొంతిల్లు మాదిరిగా పరిగణించలేదని, ఎప్పటికీ తాను పాకిస్థాకు చెందిన వాడినే అంటూ కామెంట్స్ చేశారు. గాడిదకు కేవలం రంగులు వేసినంత మాత్రాన అది చారల గుర్రం (Zebra) కాలేదు. ‘గాడిద ఎప్పటికీ గాడిదే’ అంటూ ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన కంటెంట్ క్రియేటర్ జునైద్ అక్రమ్ నిర్వహించే పాడ్ కాస్ట్ (Podcast)లో భాగంగా ఇమ్రాన్ ఈ కామెంట్స్ చేశారు. వివిధ దేశాలతో తనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ తన మాతృభూమి అంటూ చెప్పారు. మరోవైపు ఇమ్రాన్ కామెంట్స్ పై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. 

ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన పాక్ ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ మే 2023 కంటే ముందు నిర్వహించడం కష్టమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. 

 

మరిన్ని వార్తల కోసం..

ఆర్టీసీ బస్సులో సీఎం స్టాలిన్ 

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

అంబులెన్స్​ టైంకు వస్తలే