వీ6 వెలుగు పేరుతో మునుగోడుపై ఫేక్ సర్వే

వీ6 వెలుగు పేరుతో  మునుగోడుపై ఫేక్ సర్వే

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికపై వీ6 వెలుగు పేరుతో ఫేక్ సర్వేను కొంత మంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎన్నికకు ఒకరోజు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేను వీ6 వెలుగు చేసినట్లుగా లోగోతో ఓ రిపోర్ట్​ను పబ్లిక్​లో ప్రచారం చేస్తున్నారు. వీ6 వెలుగు క్రెడిబిలిటీతో జనాన్ని నమ్మించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలా వీ6 వెలుగు పేరుతో ఫేక్ సర్వేను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

గతంలో దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడూ  ఇలాగే ఫేక్ సర్వేలను సృష్టించారు.  దీనిపై చానెల్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీకి  ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాము ఏ ఎన్నికప్పుడూ  సర్వే చేయలేదని మేనేజ్ మెంట్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. పోలింగ్ పూర్తయ్యేదాకా  సర్వే రిపోర్టులు వద్దని  ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పోలింగ్ కు ఒక రోజు ముందు వీ6 వెలుగు పేరుతో ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేస్తున్నారు.