
తల్లాడ, వెలుగు: చెట్ల కొమ్మలు నరికినందుకు ఓ రైతుకు రూ.23 వేల ఫైన్ విధించారు. తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రహదారి వెంట ఉన్న ఫారెస్ట్, ఆర్ అండ్ బీకి సంబంధించిన చెట్లు ఉన్నాయి. వీటి కొమ్మలను అదే గ్రామానికి చెందిన రైతు పగిళ్ల కోటేశ్వరరావు నరికేశాడు. ఎఫ్ఆర్వో అరవింద్ సూచనతో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేశ్ రూ.23,026 ఫైన్ విధించారు. ఈ మొత్తాన్ని రైతు చెల్లించారు.