
వీణవంక, వెలుగు: కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వీణవంక మండలం గన్ముకుల గ్రామానికి చెందిన కట్కూరి సారేందర్ రెడ్డి (52)కి మూడెకరాల భూమి ఉంది. అందులో పంట వేసేందుకు పెట్టుబడి కోసం సుమారు రూ. 8 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చలేక మనస్తాపంతో మంగళవారం ఉదయం పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.