
నెక్కొండ, వెలుగు: జీవితంపై విరక్తితో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్జిల్లాలో జరిగింది. ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం మహబూబ్నాయక్ తండాకు చెందిన రైతు మాలోతు వీరన్న(45) కొంతకాలంగా మూర్చ రోగంతో బాధపడుతున్నాడు.
శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు పోతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానిక రైతులు చూసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి కొడుకు అజయ్ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.