సిల్క్ స్మిత అన్‌‌‌‌‌‌‌‌టోల్డ్ స్టోరీ

సిల్క్ స్మిత అన్‌‌‌‌‌‌‌‌టోల్డ్ స్టోరీ

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా, తాజాగా మరో బయోపిక్ రూపొందుతోంది. డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి సందర్భంగా ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ‘సిల్క్ స్మిత’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో దీన్ని  తెరకెక్కిస్తున్నారు. ‘అన్‌‌‌‌‌‌‌‌టోల్డ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌. జయరామ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

ఎస్‌‌‌‌‌‌‌‌ బి విజయ్ నిర్మిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో అలరించిన చంద్రిక రవి సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో అచ్చు సిల్క్ స్మితలానే కనిపిస్తోంది చంద్రిక. చీర ధరించి, పెద్ద కళ్ళతో గోళ్లు కొరుకుతూ ప్రజెంట్ చేసిన లుక్‌‌‌‌‌‌‌‌లో సిల్క్ స్మితలా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 

అలనాటి స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్ చేసిన సిల్క్ స్మిత.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా, పర్సనల్‌‌‌‌‌‌‌‌గా చాలా కష్టాలను చూశారు. 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని సంఘటనలను ఇందులో చూపిస్తామన్నారు మేకర్స్.  త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.