కోదాడ కోర్టులో ఫైర్ యాక్సిడెంట్​.. జూనియర్ సివిల్ కోర్టులో ఫైల్స్ దగ్ధం

కోదాడ కోర్టులో ఫైర్ యాక్సిడెంట్​.. జూనియర్ సివిల్ కోర్టులో ఫైల్స్ దగ్ధం

హైదరాబాద్​:  సూర్యాపేట జిల్లా  కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో  అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్​ సర్క్యూట్ తో కోర్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు  బీరువాల్లోని పలు పేపర్లు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్నిప్రమాదం అర్థరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది.  మూడు రోజులు కోర్టుకు సెలవులు కావడంతో సిబ్బంది గమనించలేదు.  

ఇవాళ తెల్లవారు జామున కోర్టు తెరిచి చూసే సరికి పలు ఫైల్స్ దగ్ధమయి ఉన్నాయి. బిల్డింగ్​లో అగ్ని ప్రమాదం జరిగిందని అంచనా వేశారు. ఘటన స్థలాన్ని విద్యుత్, పోలీస్ అధికారులతో కలిసి న్యాయమూర్తి శ్యాంసుందర్, పరిశీలించారు.  విచారణ చేసి కోర్టుకి రిపోర్టు సబ్మిట్ చేయాలని విద్యుత్ శాఖకు కోర్టు సిబ్బంది వినతిపత్రం అందించారు.