23 ఏండ్లు శాండ్​విచ్​లే తిన్నది..కానీ ఇప్పుడు

23 ఏండ్లు శాండ్​విచ్​లే తిన్నది..కానీ ఇప్పుడు

ఒక్కొక్కరికీ ఒక్కో ఫేవరెట్​ రెసిపీ ఉంటుంది. అలాగని అదే రోజూ తినమంటే? ఎంతిష్టమున్నా మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తారు. కానీ, జో మాత్రం తనకిష్టమైన చిప్స్,​ శాండ్​విచ్​ రోజూ పెట్టినా వద్దనదు. అసలు అవి తప్ప ఏం పెట్టినా తినదు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. గడిచిన ఇరవై రెండేండ్లుగా ఆమె మెనూలో కేవలం శాండ్​విచ్, చిప్స్​​ మాత్రమే ఉన్నాయి. ఇకమీదట ఆ మెనూ మారిపోతోంది. ఆ కథేంటంటే.. 

యుకెలో ఉంటున్న జో సాండ్లర్​కి​ రెండేండ్ల వయసులో చిప్స్​ శాండ్​విచ్​ టేస్ట్​ చేయించింది తల్లి. అప్పట్నించీ రోజూ అదే కావాలని ఏడ్చేదట జో. బలవంతంగా తల్లి మరేదైనా ఫుడ్​ తినిపించే ప్రయత్నం చేసినా నోరు తెరిచేది కాదట. దాంతో చేసేదేంలేక రోజూ చిప్స్​ శాండ్​విచ్​లనే తినిపించారు పేరెంట్స్. పెద్దయ్యాక నచ్చజెప్పొచ్చు అనుకుంటే.. ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఉదయాన్నే డ్రై సిరియల్స్​, లంచ్​, డిన్నర్​లో రెండు శాండ్​విచ్​లే ఆమె డైలీ ఫుడ్​ మెనూగా మారిపోయింది. కాకపోతే అప్పుడప్పుడు చీజ్, చిప్స్​లో ఇతర ఫ్లేవర్స్​ ట్రై చేస్తుండేది జో. అలా ఇరవై మూడేండ్లు చిప్స్​ శాండ్​విచ్​తోనే బతికేయడంతో మల్టీపుల్​ స్కెలోరిసిస్​ అనే జబ్బు బారిన పడింది జో. దానివల్ల బ్రెయిన్​, కండరాలు ఎఫెక్ట్​ అయ్యాయి. దాంతో తన ఆరోగ్యం కోసం ఫేమస్​ హిప్నోథెరపిస్ట్​ డేవిడ్​ని కలిసింది జో. అన్ని టెస్ట్​లు చేశాక తను రిస్ట్రిక్టెడ్​ ఫుడ్​ డిజార్డర్​తో బాధపడుతోందని తేల్చాడాయన​. రెండున్నర గంటల హిప్నోథెరపీ సెషన్​తో జోకి ఇతర ఫుడ్స్​పై ఉన్న భయాలన్నింటినీ పోగొట్టాడు. దాంతో ఈ మధ్యే మొదటిసారి ఫ్రూట్స్​, వెజిటబుల్స్​ తిన్నది జో . స్ట్రాబెరీలు ఇంత టేస్టీగా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా రకరకాల వంటకాల్ని టేస్ట్​ చేయాలనుకుంటున్నా అంటోంది.