బడ్జెట్ కేటాయింపులే తప్ప నిధులివ్వని సర్కార్

బడ్జెట్ కేటాయింపులే తప్ప నిధులివ్వని సర్కార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన యంత్రలక్ష్మి పథకం మూలన పడింది. యంత్రాలు కొనలేని రైతులకు తక్కువ కిరాయితో అందుబాటులోకి తెచ్చే కస్టమ్ హైరింగ్ సెంటర్లపైనా ప్రభుత్వం కనీస దృష్టిపెట్టలేదు. నాగళ్లతో దున్నేందుకు ఊర్లల్లో ఎడ్లు, పశువులు అందుబాటులో లేవు. దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లు, రొటవేటర్, కల్టీవేటర్​ వంటి యంత్ర పరికరాలే దిక్కయ్యాయి. దీంతో గ్రామాల్లో ప్రస్తుతం యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారు ముదురుతున్నా కూలీలు దొరకక, యంత్రాలు అందక రైతులకు కష్టాలు తప్పడం లేదు. 

నాలుగేళ్లుగా నిర్లక్ష్యం

ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా 2014 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 నాటికి రాష్ట్రంలో 94 వేల అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్రాక్టర్లు ఉండగా వాటిని 3.52 లక్షల వరకు పెంచారు.  ట్రాక్టర్లు ఇచ్చి పక్కకు తప్పుకున్న సర్కారు.. రైతుబంధు షురూ చేసి ఫామ్ మెకనైజేషన్ ను పట్టించుకోవడం లేదు. నాలుగేండ్లుగా యంత్రలక్ష్మీ స్కీమ్​ను అమలు చేస్తలేదు. 2022–23 బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ రూ.500 కోట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు కనీసం పైసా కూడా విడుదల చేయలేదు. 

ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్లిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయ్యట్లే

వ్యవసాయానికి అవసరమయ్యే పెద్ద యంత్రాల మాట పక్కన పెడితే కనీసం ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్లిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సర్కారు ఇవ్వడం లేదు.  ఇనుప నాగళ్లు, విత్తనాలు వేసే పరికరాలు, చిన్న చిన్న పనిముట్లు, స్ప్రేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి కూడా అందించే పరిస్థితి  లేదు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు అందించాల్సి ఉంది. ప్రతీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రారంభంలో  రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు వీటిపై దృష్టిపెట్టలేక పోవడం విమర్శలకు తావిస్తోంది.

కేంద్ర నిధులు ఆగిపోతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్రీయ కృషి వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన, నార్మల్ స్టేట్ ప్లాన్, సబ్మీషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే మూడు స్కీమ్​ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీతో యంత్రాలను అందించాల్సి ఉంది. కేంద్రం అందించే పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించక పోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాకుండా వెయ్యికోట్లకు పైగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

రైతులకు తప్పని ఇబ్బందులు

రాష్ట్రంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది. వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే తప్ప నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం నారు ముదిరిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఇలాంటి పరిస్థితుల్లో మెకనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా రైతులకు తక్కువ వడ్డీకి యంత్రాలు అందించి ఖర్చులు తగ్గిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.