చెత్తను సేకరించేందుకు గార్బేజ్ బ్యాంకు

చెత్తను సేకరించేందుకు గార్బేజ్ బ్యాంకు

తమిళనాడులోని విరుదునగర్ లో విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు బాధ్యతగా నడుం బిగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటి నివారణకు చెత్త బ్యాంకును ఏర్పాటు చేశారు.  రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కలిగే అనార్థాలను  ప్రజలకు వివరిస్తూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నో మోర్ డంప్ యార్డ్స్ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 43,367 కిలోల చెత్తను సేకరించి రీ సైక్లింగ్ చేశారు. రెండేళ్ల క్రితం  గార్బేజ్ బ్యాంక్ ను ప్రారంభించామని..దాదాపు 600 కుటుంబాలు తమకు చెత్తను అందజేస్తున్నాయని తెలిపారు.  కిలో చెత్తకు ఆరు రూపాయాలు ఇస్తున్నామని.. దీని వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 300 రూపాయాల ఆదాయం లభిస్తుందన్నారు. ఎనిమిది గంటల్లో రికార్డు స్థాయిలో 2,37,900 ప్లాస్టిక్ బ్యాగులను రీ సైక్లింగ్ చేశామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో తమ కాలేజీలోని విద్యార్థులందరూ పాల్గొంటున్నారని చెప్పారు.