హాంకాంగ్ క్రికెటర్ లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్

హాంకాంగ్ క్రికెటర్ లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్

ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలుంటాయి. ప్రేయసిని ఇంప్రెజ్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. నడి రోడ్డుపై, కాలేజీల్లో..ఇతర ప్లేస్ ల్లో తమ ప్రేమను తెలియచేస్తుంటారు. మోకాలిపై కూర్చొని.. రింగు తీసి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటారు. ఈ హాఠాత్ పరిణామానికి స్నేహితురాలు ఆశ్చర్యపోతుంది. చివరకు ప్రేమను అంగీకరిస్తుంది. తాజాగా హాంకాంగ్ క్రికెటర్ లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆసియా కప్ 2022 టోర్నీ కొనసాగుతోంది. అందులో భాగంగా బుధవారం టీమిండియా - హాంకాంగ్ జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

40 పరుగుల తేడాతో హాంకాంగ్ పరాజయం చెందింది. మ్యాచ్ అనంతరం ఎవరికి వారు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయారు. హాంకాంగ్ బ్యాట్స్ మెన్ కించిత్ షా.. నేరుగా స్టాండ్స్ లో ఉన్న తన స్నేహితురాలి వద్దకు వెళ్లాడు. ఆమె వద్ద మోకాళ్లపై కూర్చొన్నాడు. ఏమి జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. రింగును తీసి చూపించి.. లవ్ ప్రపోజల్ చేశాడు. తొలుత కంగారు పడినా... చివరకు ఒకే చెప్పింది. నమ్మలేకపోతున్నట్లు వెల్లడించింది. అక్కడున్న కెమెరా.. స్క్రీన్ పై చూపించడంతో అందరూ చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను AsianCricketCouncil ట్వీట్ చేసింది.