అరేబియా సముద్రంపై ONGC హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ 

అరేబియా సముద్రంపై ONGC హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ 

ముంబై : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్ జీసీ)కి చెందిన హెలికాఫ్టర్ ముంబైలోని అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది. అందులో ఆరుగురు సిబ్బందిని కాపాడారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఓఎన్ జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్, ఇద్దరు ఫైలట్లతో వెళ్తున్న హెలికాఫ్టర్.. ఓఎన్ జీసీ రిగ్ కు సమీపంలో అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు కంపెనీ ట్విట్టర్ లో వెల్లడించింది. హెలికాఫ్టర్ కు ఉన్న ఫ్లోటర్ల సాయంతో దిగినట్లు తెలిపింది. సమాచారం తెలియగానే ఓఎన్ జీసీ సహాయక చర్యలు చేపట్టింది. రిగ్ నుంచి సహాయక బోట్లను పంపించింది. అటు భారత తీర దళం కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంది. 

అయితే.. హెలికాఫ్టర్ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అరేబియా సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్ ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్ జీసీ ఈ సముద్రంలోనే అనేక రిగ్ లు, ఇన్ స్టాలేషన్లను ఏర్పాటు చేసింది.