
ఆర్మూర్, వెలుగు : ఆషాడమాసం సందర్భంగా ఆర్మూర్టౌన్లోని నవనాథ సిద్ధులగుట్టను సోమవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. గుట్టపై ఉన్న శివాలయాన్ని లక్షగాజులతో అలంకరించి పూజలు చేశారు. పురోహితులు కుమార్‌శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పిప్రి గైని భజన మండలి ఆధ్వర్యంలో పాడిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. రామాలయం నుంచి కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకీ సేవ జరిపారు. ఆర్మూర్ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. గుట్టపైకి వచ్చిన మహిళలకు గాజులు పంపిణీ చేశారు.