viral video: రాత్రిపూట ఇంట్లోకి చొరబడ్డ పులి, ఎలుగుబంటి

viral video: రాత్రిపూట ఇంట్లోకి చొరబడ్డ పులి, ఎలుగుబంటి

రాత్రి సమయంలో పులి, ఎలుగుబంటి ఒకదాని వెంట మరొకటి ఓ ఇంట్లోకి వెళ్లాయి. తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ సమీపంలో ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి. అన్ని ఇండ్లకు గడియలు పెట్టి ఉండటంతో ఇండ్లపైకి ఎక్కాయి. ఇంటి స్లాబులపై అంతా తిరిగాయి. ఓ ఇంటిపై ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. 

ముందుగా చిరుతపులి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి ఉండటంతో, మేడపైకి ఎక్కి అటూ ఇటూ తిరిగింది. ఆఖరికి మెట్లపైకి దూకి ఎదురింట్లోకి వెళ్లింది. దాని తర్వాత అదే ఇంటిలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. అదికూడా అటూఇటూ తచ్చాడి చివరికి కిందకు దూకి చిరుతపులి వెళ్లిన ఇంట్లోకే వెళ్లింది. అయితే అక్కడి నుంచి అవి ఎటువెళ్లాయనేది మాత్రం తెలియదు. చిరుతపులి, ఎలుగుబంటిలు ఇండ్ల మధ్య సంచరించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.