
తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లా కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. ఈ ఆలయాన్నిశ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. చూడడానికి చిన్నదిగా ఉండే ఆలయం ఎన్నో అద్భుతాలకు నెలవు. ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకుంటాడు. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
బావిలో నీరు కూడా రంగు మారుతాయి
అతిశయ వినాయగర్ ఆలయంలో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయ రణలో ఓ మంచినీటి బావి వుంది: వున్న వినాయకుడు తన రంగు ర్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లుకూ రంగును మార్చుకుంటాయి. ఈ మార్పులో చిన్న తేడా ఉంది వినాయకుడు నల్లగా ఉన్న సమయా బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయం బావిలో నీళ్లు సల్లగా ఉంటాయి.
►ALSO READ | సంతానం ఇచ్చే సిద్ది వినాయకుడు.. ఏటా రూ.125 కోట్ల హుండీ ఆదాయం