
ముంబై సిద్ధి వినాయకుడికి సంతాన ప్రదాతగా పేరుంది. ఈ మందిరం ప్రభాదేవి ప్రాంతంలో ఉంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్కు చెందిన ద్యూబయి పాటిల్ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్ లక్ష్మణ్ వితు పాటిల్ నిర్మించారు. ద్యూబాయి పాటిలు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభుకుమారుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్దివినాయకుడిని 'సవసచ గణపతి'గా భక్తులు పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చేవాడని మరాఠీ భాషలో దీనర్థం. స్వామివారు సిద్ధి, బుద్ధిల సమేతంగా భక్తులకు అభయాన్ని ఇస్తుంటారు. పైన చేతిలో గొడ్డలి, మరో చేతిలో తామర, కింద వున్న చేతుల్లో జపమాల, మోదక్లు ధరించి భక్తులకు కనువిందు చేస్తుంటారు.
ఏటా 125 కోట్ల ఆదాయం
సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఈ ఆలయానికి ఏటా రూ.125కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. సిద్ధివినాయకుడిని సామాన్యులతో పాటు పలువురు బాలీవుడ్ తారలు తరచుగా దర్శించుకుంటారు. అమితాబచ్చన్, అజయదేవణ్, సల్మాన్కాన్, దీపికా పదుకొనె తదితర తారలు స్వామివారిని దర్శించే భక్తుల్లో కొందరు కావడం విశేషం.
►ALSO READ | ఇంటి నిర్మాణంలో విఘ్నాలా? పెళ్లి కుదరడం లేదా?.. అయితే వెంటనే ఈ బొడ్డ గణేశుడిని దర్శించుకోండి
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో బొజ్జగణపయ్య రూపం ప్రత్యేకంగా ఉంటుంది. తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. గుడిలో స్వామి వారి ముందుర వెండి మూషికం ఉంటుంది. భక్తులు తమ కోరికలను ఆ ఎలుకకు చెబితే ఇట్లే తీరిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం