చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ చైర్మన్ వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజుపై అవిశ్వాసం

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ చైర్మన్ వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజుపై అవిశ్వాసం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సొంత పార్టీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజుకు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రకటించారు. గురువారం ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతికి నోటీసు అందజేశారు. 

అవిశ్వాసంపై 16 మంది సంతకాలు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా 8 వార్డుల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 3 వార్డుల్లో సీపీఎం, ఒక వార్డులో ఇంటిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీఎం కౌన్సిలర్లు కలిసి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజును ఎన్నుకున్నారు. మునుగోడు ఎన్నికల టైంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లతో పాటు, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఓ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. తర్వాత బీజేపీ నుంచి ఇద్దరు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరడంతో ఆ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 9కి చేరుకోగా, బీజేపీకి 8 మంది, సీపీఎంకు ముగ్గురు వార్డు సభ్యులు ఉన్నారు. చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజుకు మొదటి నుంచి మద్దతు ఇచ్చిన బీజేపీ, సీపీఎం కౌన్సిలర్లు కూడా ఇటీవల వ్యతిరేకతతో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లతో పాటు, ముగ్గురు సీపీఎం, 8 మంది బీజేపీ కౌన్సిలర్లు కలిసి గురువారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతికి అవిశ్వాసం నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంచాయతీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఏమీ జరగలేదన్నారు. అందుకే అవిశ్వాస నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. 

అవిశ్వాసం వెనుక కూసుకుంట్ల హస్తం ?

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పార్టీ పోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కలిసి రాజుపై అవిశ్వాసం ప్రకటించడం వెనుక ఎమ్మెల్యే కూసుకుంట్ల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.