ఇండిగో సిబ్బంది పై ప్రయాణికుడి దాడి..వీడియో వైరల్

ఇండిగో సిబ్బంది పై ప్రయాణికుడి దాడి..వీడియో వైరల్

ఇండిగో ఫ్లైట్ సిబ్బంది పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానం 6E 2175 పొగ మంచు కారణంగా ఆలస్యంగా వెళ్తుందని కో పైలెట్ తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు సాహిల్ కటారియా కో పైలెట్ పై దాడి చేశాడు. నివేదికల ప్రకారం ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం 10 గంటల ఆలస్యం తర్వాత బయల్దేరింది. 

 

 తాము చాలా సేపు విమానంలో కూర్చున్నామని, టేకాఫ్ కాకపోతే డీబోర్డ్‌కు అనుమతించాలని ఫ్లైట్ సిబ్బందిని కటారియా అడిగాడు. కో పైలెట్ అనుప్ కుమార్‌ను ఫ్లైట్ మరింత డిలే అవుతుందని చెప్పడంతో ఆగ్రహానికి గురైన కటారియా కో పైలెట్ పై దాడి చేశాడు. వెంటనే విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫ్లైట్ లోకి వచ్చి కటారియాను అరెస్టు చేశారు.

సెక్షన్ 323,341,290,22 ప్రకారం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కటారియా ను నోఫ్లై లిస్ట్ లో చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇండిగో సంస్థ తెలిపింది. 

ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ప్రయాణికుల వికృత ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పటిష్టంగా వ్యవహరిస్తామని ఇప్పటికే  చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా విమానయాన సంస్థలు, డీసీజీఐ నడుస్తుందని చెప్పారు.  ప్రతికూల వాతావరణం కారణంగా విమాన ఆలస్యాని కారణం అవుతుందని అన్నారు.