ఆస్పత్రి పైనుంచి పడి పేషెంట్.. మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఘటన

ఆస్పత్రి పైనుంచి  పడి పేషెంట్.. మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఘటన

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు:  ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి జారి పడి పేషెంట్ చనిపోయిన ఘటన  మహబూబాబాద్ ​జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం... ఇనుగుర్తి మండలం చిన్ననాగారానికి చెందిన నాయిని ఐలయ్య(50), అనారోగ్యంతో బాధపడుతూ మహబూబాబాద్​జిల్లా జనరల్​ఆస్పత్రితో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అతను నిద్ర లేచి  బిల్డింగ్ మూడో ఫ్లోర్ బాల్కని వద్దకు వెళ్లాడు. అక్కడ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందారు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి విచారించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని అప్పగించారు.