ఈజిప్టులో ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌లపై కాల్పులు.. ముగ్గురి మృతి

ఈజిప్టులో ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌లపై కాల్పులు.. ముగ్గురి మృతి

ఇజ్రాయెల్‌ సైనిక దళాలకు, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై ఐదువేల రాకెట్లతో దాడి చేయడంతో భారీగా నష్టం జరిగింది. ఇటు ఇజ్రాయిల్ కూడా ప్రతిదాడికి దిగింది. ఈ క్రమంలో ఈజిప్టులోని ఇజ్రాయెల్‌ టూరిస్టులపై కాల్పులు జరిగాయి. అలెగ్జాండ్రియా నగరంలో ఆదివారం (అక్టోబర్ 8న) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.

అలెగ్జాండ్రియా నగరంలోని ఓ టూరిస్ట్ ప్లేస్ లో స్థానిక పోలీసు ఒకరు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు పౌరులు, ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి చనిపోయారు. ఈ విషయాన్ని ఈజిప్టు మీడియా వెల్లడించింది.

ALSO READ : ఇజ్రాయిల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. నిజంగా ఇవాళ ఇది లేకుంటే..? 

పాంపీస్‌ పిల్లర్‌ సైట్‌ వద్ద జరిగిన మరొక దాడిలో ఓ వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతాన్ని వెంటనే భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఈజిప్టు మీడియా చెప్పింది.